BDK: కొత్తగూడెం కార్పొరేషన్లో అన్ని డివిజన్లకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం చేశామని కమిషనర్ సుజాత తెలిపారు. పరిశీలించేందుకు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మొత్తం 60 డివిజన్లో 70,503 మంది మహిళా ఓటర్లు, 64,590 మంది పురుష ఓటర్లు, ఇతరులు 30 మంది ఉన్నారని అన్నారు.