ప్రకాశం: దర్శి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మెన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. వారు కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తమ కుటుంబంపై కార్యకర్తలు, అభిమానుల అభిమానం మర్చిపోలేనిదని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.