చలికాలంలో చర్మం పగలడం సర్వసాధారణం. అయితే స్నానం చేసిన తర్వాత, పడుకునే ముందు మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాస్తే ఈ సమస్యను కంట్రోల్ చేయొచ్చు. అలాగే రోజూ సరిపడినంతగా నీరు తాగితే శరీరంతో పాటు చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. చన్నీళ్లతో కాక గోరువెచ్చని నీళ్లతో స్నానం ఉత్తమం. ఇక చర్మంపై పొలుసులు పోతాయని గట్టిగా సబ్బు రుద్దకండి. అలా రుద్దితే సమస్య అలాగే ఉంటుంది.