WGL: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు రూ. 48 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ నూతన సంవత్సరాని ఆహ్వానించే వేడుకల్లో మద్యం ప్రియులు రికార్డు స్థాయిలో మద్యం కొనుగోలు చేశారు. జిల్లాలో 134 బార్/ రెస్టారెంట్, 295 వైన్సుల ద్వారా కొనుగోలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.