CTR: జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, పుంగనూరు డివిజన్ల పరంగా కార్యక్రమం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 40 సెక్షన్ల పరిధిలో అధికారులు, సిబ్బందితో కలిసి సమస్యలు తెలుసుకొని యాప్లో నమోదు చేస్తారన్నారు.