NZB: కొత్త ఏడాది సందర్భంగా ఆఫీసర్స్ క్లబ్ ప్రతినిధులు సీపీ సాయిచైతన్యను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ కార్యాలయంలో ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు తాహెర్బిన్ హందాన్, కార్యదర్శి డాక్టర్ జలగం తిరుపతిరావు, సహ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి ఉన్నారు.