ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా పోలాండ్ ప్లేయర్ స్వైటెక్ (Switech) నిలిచారు. ఫైనల్లో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ముచోవాపై ఆమె 6-2, 5-7, 6-4 తేడాతో గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. స్వైటెక్‌కు గత నాలుగేళ్లలో ఇది మూడో గ్రాండ్ స్లామ్ (Grand Slam)టైటిల్ కావడం విశేషం. అలాగే వరుసగా రెండో ఏడాది ఆమె ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నారు. తొలి సెట్ ను సునాయాసంగా చేజిక్కించుకున్న స్వైటెక్… రెండో సెట్ ను ప్రత్యర్థికి కోల్పోయింది. ఓ దశలో వెనుకబడి ఉన్న చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి ముచోవా (Muchova) అనూహ్యరీతిలో పుంజుకుని రెండో సెట్ ను 7-5తో గెలిచింది.
నిర్ణయాత్మక చివరి సెట్ లోనూ హోరాహోరీ తప్పలేదు. ఆఖరికి స్వైటెక్ దే పైచేయి అయింది. ఇగా స్వైటెక్ గతేడాది కూడా ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ గా నిలిచింది. అదే జోరును ఈ ఏడాది కూడా ప్రదర్శిస్తూ వరుసగా రెండో ఓడాది టైటిల్ ఒడిసిపట్టింది. అంతకుముందు 2020లోనూ ఈ పోలెండ్ (Poland)అమ్మడే చాంపియన్ గా నిలిచింది. ఓవరాల్ గా మూడు పర్యాయాలు ఫ్రెంచ్ ఓపెన్ ను గెలిచింది. నేటి ఫైనల్లో కొన్ని ఉత్కంఠభరిత క్షణాలను అధిగమించిన స్వైటెక్ చివరి పాయింట్ సాధించిన అనంతరం తీవ్ర భావోద్వేగాలకు లోనై ఏడ్చేసింది.