ATP: రాయదుర్గం మండలం గోనబావి బాలికల ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.12.27 కోట్లు మంజూరు చేసింది. రేకుల షెడ్లలో బాలికలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో నిధులు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ నుంచి ఈ నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కాలవ తెలిపారు.