MBNR: బాలానగర్ మండలం కొత్త సూరారం 7వ వార్డులో నెలకొన్న నీటి సమస్యను మాజీ సర్పంచ్ పూలమోని నరసింహులు పరిష్కరించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు- ఓటమి సంబంధం లేకుండా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, తన సొంత ఖర్చుతో సింగిల్ ఫేజ్ మోటార్‌ను ఏర్పాటు చేసి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వార్డు ప్రజలు నరసింహులుకు కృతజ్ఞతలు తెలియజేశారు.