విశాఖపట్నం ఆర్మ్డ్ రిజర్వ్ మైదానంలో ఇన్స్పెక్షన్ పరేడ్‌ను, నగర ఆర్మ్డ్ రిజర్వ్‌ను పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చీ బుధవారం పరిశీలించారు. సిబ్బంది టర్న్అవుట్, డాగ్ స్క్వాడ్ పనితీరు, లాఠీ డ్రిల్, ఆర్మ్స్ డ్రిల్, పీఈటీ, బ్యాండ్, వెపన్ స్కిప్పింగ్ వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన దర్బార్‌లో సిబ్బంది నుంచి వినతులు స్వీకరించారు.