E.G: ధవళేశ్వరంలోని చెరుకూరి లే అవుట్లో గంజాయి నిల్వ ఉందన్న సమాచారంతో సీఐ గణేశ్ నేతృత్వంలో పోలీసులు దాడులు నిర్వహించి, గంజాయి తరలిస్తున్న ఇద్దరు రౌడీషీటర్లను అరెస్టు చేశారు. 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, నిందితులు సూర్యగాంధీ, తిమ్మరాజుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.