RR: షాద్నగర్ పట్టణానికి చెందిన భారతమ్మ అనే మహిళ భిక్షాటన ద్వారా జీవనం సాగించేది. అయితే ఆమె ఇవాళ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చెన్నయ్య మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. మానవతా విలువలను కాపాడుతున్న చెన్నయ్య సేవా దృక్పథం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పలువురు ప్రశంసించారు.