NGKL: రేపు నూతన సంవత్సరం-2026 ను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ బదవత్ సంతోష్ కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త ఏడాదిలో జిల్లా అన్ని రంగాల్లో పురోగమించాలని, ముఖ్యంగా విద్య, వ్యవసాయం, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో ప్రజలు రాణించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, శాంతియుత వాతావరణంలో జీవించాలని ఆయన కోరారు .