MLG: జిల్లా సహజ ప్రకృతి అందాలు, చారిత్రక పర్యాటక ప్రదేశాలతో భూతల స్వర్గధామంగా మారిందని మంత్రి సీతక్క తెలిపారు. ఇవాళ తాడ్వాయి మండలంలో ఎకో టూరిజం పరిధిలో తాడ్వాయి హాట్స్, రెండు సఫారీ వాహనాలను మంత్రి, కలెక్టర్ దివాకర్ టీ.ఎస్, SP సుధీర్ రామ్నాథ్ కేకన్, DFO రాహుల్ కిషన్ జాదవ్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి సఫారీలో 7 కి.మీ. పర్యటించారు.