WGL: వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన WGLకు చెందిన అర్జున్ ఎరిగైసిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. దోహాలో జరిగిన పోటీల్లో అర్జున్ చూపిన అద్భుత ప్రతిభను మోదీ ట్విట్టర్లో కొనియాడారు. ఆయన విజయాలు దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపారు.