సత్యసాయి: బుక్కపట్నం పోలీస్ స్టేషన్ కొత్త ఎస్సైగా నారాయణరెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందిస్తానని తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.