విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు తన నియోజకవర్గం పరిధిలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల సమస్యలు తెలుసుకుంటూ పెన్షన్లను అందజేశారు. 62వ వార్డులోని మత్స్యకారులకు అంబేద్కర్ కాలనీ, ప్రకాష్ నగర్, టీడీపీ కాలనీ, గుడివాడ కాలనీ ప్రాంతాల్లో స్థానికంగా ఉంటున్న వారిని పలకరిస్తూ జీవన విధానం తెలుసుకున్నారు. ఆయన వెంట సచివాలయం సిబ్బంది, వార్డు నాయకులు ఉన్నారు.