NLR: దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం జగన్మాతకు కాత్యాయని వ్రత ఉత్సవం జరిగింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి కోవూరు జనార్దన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలోని శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామి, శ్రీ గాయత్రీ దేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.