SRD: సిర్గాపూర్ మండలంలోని జమ్లా తాండ గ్రామపంచాయతీలో మంగళవారం స్థానిక సర్పంచ్ విస్లావత్ పార్వతి, ఉప సర్పంచ్ శివాజీ నాయక్ మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. ఎంపీ సురేష్ శెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి కృషితో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభుత్వం చీరలు పంపిణీ చేసిందన్నారు.