PPM: మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మంగళవారం ఉదయం శంకుస్థాపన చేశారు. పార్వతీపురం పట్టణంలోని కొత్తవలస వై జంక్షన్లో వాజ్ పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ కూటమి నాయకులు ఏర్పాట్లు చేయగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసి శంకుస్థాపన చేశారు.