ELR: జనవరి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒక్కరోజు ముందుగానే, అంటే బుధవారం (డిసెంబరు. 31) పంపిణీ చేయనున్నట్లు MPDO బేబి శ్రీలక్ష్మి తెలిపారు. జనవరి 1వ తేదీ సెలవు దినం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని 8,524 మంది లబ్ధిదారులకు గాను మొత్తం రూ. 3,77,44,500 నిధులను సిద్ధం చేశామన్నారు.