శ్రీకాకుళం: వజ్రపుకొత్తూరు మండలం సుంకరి జగన్నాధపురం గ్రామానికి చెందిన తండ్రిలేని ఓ చిన్నారి పేరున ‘ఉద్దానం సేవా సమితి’ పోస్టల్ నెలవారీ డిపాజిట్ చేశారు. కూలి చేస్తూ ఇద్దరు కుమార్తెలను పోషిస్తున్న గాడి రాజేశ్వరి భర్త కొద్ధి నెలలు క్రితం మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న వ్యవస్థాపకులు కుత్తుమ లక్ష్మణరావు, సభ్యులు మంగళవారం రూ.10 వేలు ఆమెకు అందజేశారు.