‘పతంగ్’ సినిమాకు వస్తోన్న స్పందన చూసి సంతోషంగా ఉందని దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి అన్నాడు. ఈ మూవీలో గౌతమ్ మీనన్ పోషించిన పాత్ర కోసం ముందుగా దర్శకులు సందీప్ రెడ్డి వంగా, SJ సూర్య, నాగ్ అశ్విన్, నిర్మాత దిల్ రాజులలో ఎవరో ఒకరిని తీసుకోవాలనుకున్నానని చెప్పాడు. కానీ అది కుదరలేదన్నాడు. రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో శిక్షణ పొందినట్లు, దర్శకుడిగా ఇదే తన తొలి సినిమా అని తెలిపాడు.