విదేశీ కార్మికులకు వీసా, నివాస విధానాలను సరళీకృతం చేయడానికి కువైట్ కొత్త ఎలక్ట్రానిక్ సేవలను ప్రారంభించింది. విదేశీ ఉద్యోగులకు త్వరిత, మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆ దేశ హోంశాఖ శాఖ తెలిపింది. ఈ నిర్ణయంతో ఇకపై వీసా పునరుద్ధరణ, రెసిడెన్సీ పర్మిట్ల బదిలీ వంటి సేవలు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో పొందవచ్చని చెప్పింది.