SKLM: రణస్థలం ఐసీడీయస్ ప్రాజెక్ట్ పరిధిలో మినీ అంగన్వాడీ కార్యకర్తలుగా విధులు నిర్వహిస్తున్న 22 మందికి ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలుగా స్థాయిని పెంచుతూ ఉత్తర్వులు వచ్చాయి. ఎచ్చెర్ల MLA సోమవారం వారికి నియామకపత్రాలు అందజేశారు. ఏళ్లనాటి తమ కలను నెరవేర్చినందుకు వారంతా ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.