తిరుపతి గరుడ వారధిపై సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. లక్ష్మీపురం సర్కిల్ వద్ద బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు భగత్ సింగ్ నగర్ చెందిన శ్యామలాగా పోలీసులు గుర్తించారు. గాయపడిన రూప అనే మహిళను ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.