AP: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనిల్ కుమార్ అనే వ్యక్తి తన తొమ్మిదేళ్ల కొడుకుతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మస్కిటో కాయిల్ అంటించాడు. నిద్రలో ఆ కాయిల్ ప్రమాదవశాత్తూ దుప్పటికి అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనిల్ కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.