AP: సచివాలయ ఉద్యోగ సంఘం ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయింది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 9 కేటగిరీల్లో అభ్యర్థులు పోటీకి దిగారు. ఉద్యోగ సంఘంలో 1,160 మంది ఓటర్లున్నారు. సచివాలయ ఉద్యోగ సంఘాల ఎన్నికల సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.