TG: పార్టీ వదిలి వెళ్లిన నేతలను మళ్లీ తీసుకునే అవసరం లేదని మాజీ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. BRSను కాదని బీజేపీలోకి వెళ్లిన నేతల నియోజకవర్గాల్లో ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలిచారో చూశాం కదా అని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో BRSకు 80శాతం ఫలితాలు వచ్చాయన్నారు. నేతల బలం లేకున్నా తమ కార్యకర్తలు సర్పంచులను గెలిపించుకున్నారని కొనియాడారు.