అన్నమయ్య: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజా దర్బార్ సోమవారం ఉదయం నిర్వహించారు. మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాలకు చెందిన ప్రజలు తరలి వచ్చారు. సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు వివరించారు. భూమి, ఇంటి తదితర సమస్యలతో కూడిన 13 అర్జీలు వచ్చాయి. ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.