TG: కాసేపట్లో మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన GHMC స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరగనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ అధికారులు సిద్ధం చేసిన బడ్జెట్ ముసాయిదాను స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్ ముసాయిదాపై చర్చించిన తర్వాత సభ్యులు ఆమోదం తెలపనున్నారు. ఈసారి రూ. 11,460 కోట్లతో బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.