అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన వారం సంతల ద్వారా మొత్తం రూ.3,42,700 ఆదాయం లభించింది. శనివారం జరిగిన గొర్రెలు, మేకల సంతలో రూ.2,04,100 ఆదాయం వచ్చింది. ఆదివారం నిర్వహించిన పశువుల సంత ద్వారా రూ.1,38,600 ఆదాయం సమకూరిందని యార్డు ఎంపికశ్రేణి ఇన్ఛార్జ్ కార్యదర్శి, జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు రాఘవేంద్రకుమార్ తెలిపారు.