ప్రకాశం: పామూరు పట్టణంలోని నెల్లూరు రోడ్డులో నూతన టీడీపీ కార్యాలయాన్ని ఇవాళ సాయంత్రం 4:00 గంటలకు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభిస్తారని మండల టీడీపీ అధ్యక్షుడు బొల్లా నరసింహారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, అనుబంధ విభాగాల నాయకులు హాజరై కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.