TG: శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కొచ్చి, జెడ్డా నుంచి వస్తున్న ఇండిగో విమానాల్లో RDX అమర్చినట్లు గుర్తుతెలియని వ్యక్తి మెయిల్ పంపాడు. ఇదే సమయంలో కోల్కతా-శంషాబాద్ ఇండిగో విమానంపై లేజర్ లైట్ పడిన ఘటన కలకలం రేపింది. దీంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఏడాదిలో 30 సార్లకు పైగా ఎయిర్పోర్టుకు బెదిరింపులు రావడం గమనార్హం.