EG: వడిశలేరు గ్రామం గన్నివారి తోటలోని GSL మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్న 7వ వార్షిక ఎడ్ల బళ్ల పోటీలు మరియు గుర్రాల పరుగు పోటీలను ఆదివారం మంత్రి దుర్గేష్ ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ క్రీడలు మన సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రతీకలు. ఇటువంటి పోటీలు యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించడంతో పాటు గ్రామీణ జీవన సౌందర్యాన్ని తరతరాలకు అందిస్తాయన్నారు.