MLG: రామచంద్రాపురానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురై ఖాతా నుంచి రూ.4.80 లక్షలు కోల్పోయాడు. SI వివరాల ప్రకారం.. ఈ నెల 24న మెడికల్ షాప్లో UPI ద్వారా రూ.700 చెల్లించే ప్రయత్నంలో డబ్బులు లేవని మెసేజ్ రావడంతో బ్యాంక్లో తనిఖీ చేయగా ముందు రోజు రూ.4,80,000 అపరిచిత ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.