VZM: గజపతినగరం రైల్వే స్టేషన్ జంక్షన్ సమీపంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు విశాఖపట్నంలోని కంచరపాలేనికి చెందిన పొట్నూరు వినయ్ (36), ఎర్రబెల్లి దినేష్ కుమార్ (31)గా పోలీసులు గుర్తించారు. బేకరీకి సంబంధించిన సామాన్లు రాయగడలో షాపులకి ఇచ్చి తిరిగి విశాఖ వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు ఎస్సై కిరణ్ గారు తెలిపారు.