ATP: శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డా. సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం గ్రామ కమిటీని నియమించారు. గ్రామ అధ్యక్షుడిగా ఆర్. నాగరాజును ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శులుగా ఐదుగురిని, కార్యదర్శులుగా మరో ఐదుగురిని నియమించడంతో పాటు అనుబంధ విభాగాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా, యువజన విభాగాలకు అధ్యక్షులను కేటాయించారు.