AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని TTD అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు అర్ధరాత్రి 12.05 గంటలకు శ్రీవారి ఆలయాన్ని తెరిచి ఏకాంతంగా పూజలు నిర్వహించనున్నారు. 1.30 గంటలకు శ్రీవారి వైకుంఠద్వార దర్శనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎల్లుండి ఉదయం నుంచి లక్కీడిప్‌లో టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారిని దర్శించుకోనున్నారు.