KMM: ఏసీపీ వసుంధర యాదవ్ సత్తుపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులు మరియు స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న FIR లను పరిశీలించి, క్షేత్రస్థాయి పర్యవేక్షణ కోసం కానిస్టేబుళ్లను గ్రామ పోలీస్ అధికారులుగా నియమించాలని సూచించారు. రౌడీ షీటర్లపై నిఘా ఉంచుతూ, శాంతిభద్రతలను కాపాడాలని సిబ్బందిని ఆదేశించారు.