అనంతపురంలో చైన్ స్నాచింగులు, ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.70 లక్షల విలువైన 40 తులాల బంగారం, 7 కిలోల వెండి, లక్ష నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. నిందితులు కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారికి చెందిన వారని పేర్కొన్నారు.