SDPT: సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మాంజా విక్రయాలపై హుస్నాబాద్ పోలీసు యంత్రాంగం నిఘా తీవ్రం చేసింది. శనివారం పట్టణ కేంద్రంలోని పలు జనరల్ స్టోర్స్, బుక్ స్టాల్స్‌లో ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పండుగ సీజన్లో అక్రమ విక్రయాలను అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.