వరంగల్ నగరంలో రోజుకు ఉత్పత్తి అవుతున్న భారీ మున్సిపల్ వ్యర్థాల సమర్థ వినియోగం కోసం కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ఎంపీ డా. కడియం కావ్య ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు ఇవాళ లేఖ రాశారు. ప్లాంట్‌కు అవసరమైన స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.