NZB: నందిపేట తహశీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఇవాళ భూభారతి పెండింగ్ దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. మండలంలోని ఒక్కో గ్రామం వారీగా పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే విషయాలపై కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు.