MLG: మేడారం మహా జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆర్బ్ల్యూఎస్ ఆధ్వర్యంలో మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే జంపన్న వాగు, ఆర్టీసీ బస్టాండ్, స్నాన ఘట్టాలు, చిలకలగుట్ట తదితర ప్రాంతాల్లో ఈ సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఈ మొబైల్ మరుగుదొడ్లు ఎంతగానో ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు.