MBNR: కొత్తకోట పట్టణ కేంద్రంలో 35 నిరుపేద లబ్ధిదారులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శనివారం ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు కల్పించడం లక్ష్యంగా పని చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల మంజూరులో నిర్లక్ష్యం జరిగిందని తెలిపారు. తాము అర్హులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.