NZB: పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 129 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ రాజేశ్ చంద్ర తెలిపారు. వీరందరినీ కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. న్యాయమూర్తి 129 మందికి రూ.8.80 లక్షల జరిమానా వేసినట్లు పేర్కొన్నారు. అలాగే 10 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధించారని వెల్లడించారు.