ప్రకాశం: ప్రజల భద్రతను బలోపేతం చేయడం మరియు రోడ్డు ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా పోలీసులు దర్శి పట్టణంలోని ఏఎస్పీ కాలువ ప్రాంతంలో హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించాల్సిన ప్రాధాన్యతను వివరించారు. అదేవిధంగా, వారి భద్రత కోసం హెల్మెట్లు పంపిణీ చేసారు.