‘ధురంధర్’ నటుడు అక్షయ్ ఖన్నాపై ‘దృశ్యం 3’ నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ దావా వేశాడు. ‘దృశ్యం 3’ కోసం చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించాడని ఆయనకు లీగల్ నోటీసులు పంపాడు. ఒప్పందం జరిగినప్పుడే కొంతమొత్తంలో అడ్వాన్స్ చెల్లించినట్లు, ఆయన సినిమాలో భాగం కావడం లేదని టెక్స్ట్ మెసేజ్ చేశాడని నిర్మాత ఆరోపించాడు. కాగా, రెమ్యూనరేషన్ విషయంలో వచ్చిన విభేదాలతో అక్షయ్ ఈ మూవీ నుంచి తప్పుకున్నాడట.