కృష్ణా: వణుకూరు గ్రామంలో రూ.14 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రిబ్బన్ కట్ చేసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే రోజువారీ కార్యక్రమాలపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని అంగన్వాడీ టీచర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.